ఖరీదైన పోషకాహారాల వెనుక పరుగెడుతున్నారా? తక్కువ ఖర్చుతోనే సూపర్ హెల్త్ ఇచ్చేవి ఇవే
మన పూర్వీకులు ఎలాంటి ఖరీదైన ఆహారాలు తీసుకోకపోయినా సహజమైన దేశీ ఆహారాలు తింటూ ఎంతో కాలం ఆరోగ్యంగా జీవించారు. నేడు మార్కెట్లో లభించే ప్యాకెట్ జ్యూస్‌లు, బ్రాండెడ్ నట్స్‌కు బదులుగా మన ఇంట్లోనే దొరికే మజ్జిగ, వేరుశనగలు ఎంతో మేలు చేస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా సమానమైన పోషకాలను అందించే ప్రత్యామ్నాయాలు చూద్దాం. ఓట్స్‌కు బదులుగా దలియా చాలామంది బరువు తగ్గడానికి ఉదయాన్నే ఓట్స్ తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఓట్స్‌లో లభించే దాదాపు అన్ని…
