వెంకీ మామ నైంన్టీస్లోనే బాలీవుడ్ సినిమా చేశారని మీకు తెలుసా..?
వెంకటేష్ కెరీర్లో చంటి చిత్రం ఒక అద్భుతమైన మలుపు. తన ఇంటి పేరుగా విజయాలను మార్చుకున్న వెంకటేష్, విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. 1991లో శత్రువు, కూలీ నెంబర్ వన్, సూర్య ఐపీఎస్, క్షణక్షణం వంటి నాలుగు యాక్షన్ చిత్రాలలో నటించిన తర్వాత, ఒక వెరైటీగా కుటుంబ కథా చిత్రం చేయాలని వెంకటేష్ భావించారు. ఆ సమయంలో నిర్మాత కేఎస్ రామారావుకు ఒక అవకాశం లభించింది. చిరంజీవితో నిర్మించిన స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్…
