తాజావార్తలు

నాన్‌వెజ్‌లోనే కింగ్.. ముక్క తింటే ఆ రోగాలన్నీ మటాష్.. చేపల గురించి ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదలరు..


ప్రాచీన కాలం నుండి మాంసాహార ప్రియులకు ఇష్టమైన ఆహారంగా ఉన్న చేపలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చేపల మాంసంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. మాంసాకృత్తులు (ప్రోటీన్), విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా తేలికగా జీర్ణమవుతాయి. మీ రోజువారీ ఆహారంలో చేపలను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయని డైటీషియన్లు సూచిస్తున్నారు. అంతేకాకుండా పలు సమస్యల నుంచి బయట పడొచ్చని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొంటున్నారు.

  1. చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 23 శాతం వరకు తగ్గుతాయి. మెదడు పనితీరుకు అవసరమైన పోషకాలను చేపలు అందిస్తాయి.
  2. నిత్యం చేపలు తినడం వల్ల అల్జీమర్స్ వ్యాధిని నివారించవచ్చు. వీటిని తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే, డిప్రెషన్ లక్షణాలను తగ్గించి, ఆందోళన నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.
  3. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులతో బాధపడేవారు తమ ఆహారంలో చేపలను చేర్చుకోవడం ద్వారా పూర్తి ఉపశమనం పొందవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు..
  4. అంతేకాకుండా.. చేపలు శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, LDL కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. విటమిన్ డి చేపలలో పుష్కలంగా ఉండటం వలన కంటి చూపును మెరుగుపరుస్తుంది.
  5. చేపలు రెగ్యులర్‌గా తినడం వల్ల కంటి నరాల అభివృద్ధి జరుగుతుంది. దీంతో దృష్టి లోపాలు రాకుండా ఉండటానికి తోడ్పడుతుంది.
  6. చేపల్లో అధిక ప్రొటీన్ ఉండటం వల్ల కండరాల వృద్ధికి, దెబ్బతిన్న కణజాలం మరమ్మత్తుకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
  7. చేపల్లోని పోషకాలు.. ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. అంతేకాకుండా.. పలు సమస్యలు రాకుండా నిరోధిస్తాయి.

అందుకే.. ఆరోగ్యకరమైన జీవితం కోసం జలపుష్పాలు (చేపలు).. మీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *