తాజావార్తలు

వంటగ్యాస్ సిలిండర్లకు కాలం చెల్లనుందా? పీఎన్‌జీ వైపు అడుగులు వేస్తున్న కేంద్రం!


దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో పైప్డ్ నేచురల్ గ్యాస్వినియోగాన్ని వేగవంతం చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పీఎన్‌జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఈ మార్పును త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక లేఖ రాశారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, వినియోగదారుల మధ్య సమన్వయం కోసం జిల్లా స్థాయి పరిపాలనా మద్దతు ఎంతైనా అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఎల్పీజీతో పోలిస్తే పీఎన్‌జీ ఎంతో సురక్షితమైనది, పర్యావరణ అనుకూలమైనది కావడంతో పాటు సిలిండర్ల పంపిణీ భారాన్ని పూర్తిగా తగ్గిస్తుందని కేంద్రం పేర్కొంది. ఇటీవల పశ్చిమాసియా సంక్షోభం సమయంలో ఎల్పీజీ సరఫరాకు అంతరాయాలు ఏర్పడినప్పటికీ, దేశీయంగా ఉత్పత్తి అయ్యే పీఎన్‌జీ సరఫరా మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగింది. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశ ఇంధన భద్రతను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే అత్యవసర వస్తువుల చట్టం-1955 కింద నిబంధనలు జారీ అయ్యాయి. దీని ప్రకారం పీఎన్‌జీ సౌకర్యం ఉన్న ఇళ్లు ఎల్పీజీ కనెక్షన్‌ను కలిగి ఉండకూడదు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోతే ఎల్పీజీ కనెక్షన్‌ను నిలిపివేసే అధికారం అధికారులకు ఉంటుంది. కొత్తగా నియమితులయ్యే జిల్లా నోడల్ అధికారులు హౌసింగ్ సొసైటీల అనుమతులు, గ్యాస్ కంపెనీల సమన్వయం, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. వీలైనంత త్వరగా నోడల్ అధికారులను నియమించి వివరాలు పంపాలని కేంద్రం కోరింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price: పసిడి పరుగులు.. ఇవాళ తులం బంగారం ధర ఇదే!

ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

ఎయిర్‌హోస్టెస్ నుంచి పోలీస్ ఆఫీసర్‌గా వచ్చింది.. అవినీతి ఊబిలో చిక్కుకొని..

2026 Lunar Eclipse: ఆగస్టు 28న ఆకాశంలో అద్భుతం.. భారత్‌లో కనిపిస్తుందా?

గంటల తరబడి మొబైల్‌ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు తప్పదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *