అంకెల్లో మాయం అవుతున్న నిరుద్యోగులు.. నిరుద్యోగిత రేటు అంకెల వెనుక అసలు నిజాలివే..
ఒక పాతికేళ్ల యువకుడు రెండేళ్లుగా ఎన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా తిరస్కరణే ఎదురవడంతో విసిగిపోయి, గతేడాది నుంచి ఉద్యోగాల కోసం వెతకడమే మానేశాడు. ఈరోజు అతడిని “నువ్వు నిరుద్యోగివా?” అని అడిగితే.. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం అతడు ‘నిరుద్యోగి’ కాడు! ఇది వినడానికి విచిత్రంగా అనిపించినప్పటికీ, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగాన్ని కొలిచే ప్రామాణిక పద్ధతి ఇదే. అసలు ఈ లెక్కలు ఎలా వేస్తారు? అధికారిక శాతాల వెనుక దాగి ఉన్న అసలు నిరుద్యోగుల సంఖ్య…
