మార్కెట్ ధర కంటే తక్కువే.. శ్రీవారి గోల్డ్, సిల్వర్ డాలర్లకు భారీ డిమాండ్
తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్లకు డిమాండ్ పెరిగింది. బులియన్ మార్కెట్లో రోజురోజుకు పరుగులు పెడుతున్న బంగారు, వెండి ధరలతో కొండపై డాలర్స్ గిరాకీ నెలకొంది. తిరుమలలో వారానికో రోజు మాత్రమే ధర నిర్ణయిస్తున్న టీటీడీ మార్కెట్లో కంటే తక్కువగా బంగారు ధర ఉండడంతో కొనుగోలుకు డిమాండ్ పెరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండము వద్ద ఉన్న కౌంటర్లో బంగారు వెండి డాలర్లను టీటీడీ విక్రయిస్తోంది. 10,5,2 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్లు, 50,10,5…
