Yellamma : బలగం సినిమాను మించి.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఎల్లమ్మ గ్లింప్స్.. దేవి శ్రీ ప్రసాద్ మేకోవర్ మాములుగా లేదుగా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు ఎల్దండి. ఎన్నో హిట్ చిత్రాల్లో తన నటనతో నవ్వించిన వేణు.. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో మరింత ఫేమస్ అయ్యాడు. అటు సినిమాలు.. ఇటు కామెడీ షోలతో అలరించిన వేణు.. దర్శకుడిగానూ సక్సెస్ అయ్యాడు. దాదాపు మూడేళ్ల క్రితం బలగం సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఊహించని స్థాయిలో…
