కమ్యూనిస్టులు దేవుడిని వ్యతిరేకించరు కానీ..: కూనంనేని సంచలన కామెంట్స్
కమ్యూనిస్టులు దేవుడిని వ్యతిరేకించరని సీపీఐ నాయకులు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. TV9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో ఆయన తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో మతతత్వ భావజాలం, మూఢ నమ్మకాలు పెరుగుతున్న తీరును ఆయన ఆందోళనగా ప్రస్తావించారు. సైన్స్ పట్ల నమ్మకం పెరుగుతున్నప్పటికీ, దేవుళ్ల పట్ల భక్తిని విశ్వసించే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎదురవుతున్న సవాళ్లను అంగీకరించారు. గతంలో కమ్యూనిస్టులు సాధించిన విజయాలను…
