సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ నటుడిగా ఎదగాలనే కల ఉండకపోవచ్చు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చి, తమ ప్రతిభతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ ఒకరు. ప్రేమకథల్లో చాక్లెట్ బాయ్‌గా అమ్మాయిల మనసు దోచుకున్న ఆయన.. విలన్‌గా, సీరియస్ పాత్రల్లోనూ తనదైన నటనతో మెప్పించారు. అయితే మాధవన్ జీవితంలో చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. చిన్నతనంలో ఆయనకు నటుడు కావాలనే కోరిక కంటే భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆశయమే ఎక్కువగా ఉండేదట. ఆర్. మాధవన్‌కు చిన్నతనం నుంచే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలపై ఆసక్తి ఉండేదట. చదువుకునే రోజుల్లోనే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో చురుగ్గా పాల్గొన్న ఆయన.. సైన్యంలో చేరాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి అత్యుత్తమ క్యాడెట్‌గా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఇంగ్లాండ్‌లో బ్రిటిష్ ఆర్మీ, రాయల్ నేవీ, రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఆయనకు లభించింది.
బాబోయ్.. ఈ చిన్నది బయట ఎలా ఉందో చూశారా..! స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకోవాల్సిందే
దేశానికి సేవ చేయాలనే బలమైన సంకల్పం ఉన్న మాధవన్‌కు సైనిక వృత్తి పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. అయితే వయోపరిమితి కారణంగా భారత సైన్యంలో చేరాలన్న ఆయన కల నెరవేరలేదు. దీంతో చిన్నప్పటి ఆశయం పక్కకు తప్పుకున్నప్పటికీ, జీవితంలో మరో మార్గాన్ని ఎంచుకుని తన ప్రతిభను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు. సైన్యంలో చేరాలనే కల నెరవేరకపోవడంతో మాధవన్ తన కెరీర్‌ను మరో దిశగా మలుచుకున్నారు. తొలుత టెలివిజన్ కార్యక్రమాలు, సీరియళ్లలో కనిపించిన ఆయన.. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అలైపాయుతే (తెలుగులో సఖి) సినిమాతో ఆయనకు విపరీతమైన గుర్తింపు లభించింది.
రజినీకాంత్‌కు జోడీగా 27 ఏళ్ల హీరోయిన్.. భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా
ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం రొమాంటిక్ హీరోగానే కాకుండా, కథకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా రాణిస్తున్నారు. మాధవన్ కెరీర్‌ను పరిశీలిస్తే, ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా విభిన్నమైన కథల్లో నటించేందుకు ఆయన ఆసక్తి చూపిన విషయం స్పష్టమవుతుంది. ముఖ్యంగా రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ సినిమాతో నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. నిజ జీవితంలో సైన్యంలో చేరాలన్న కల నెరవేరకపోయినా, తెరపై మాత్రం మాధవన్ పవర్ ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ధురంధర్ చిత్రంలో అజయ్ సన్యాల్ పాత్రతో ఆడియన్స్ ను అలరించారు మాధవన్.
మహేష్ బాబు తర్వాత ఆ హీరో నటన అంటే నాకు చాలా ఇష్టం: సూపర్ స్టార్ కృష్ణ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
