తాజావార్తలు

నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..

నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..


నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..

అదనపు కట్నం వేధింపులు ఒక నవవధువు ప్రాణాన్ని బలిగొన్నాయి. అత్తంటి వారు బైక్ కొనివ్వలేదనే ఒకే ఒక్క కారణంతో భార్యను హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడయిన భర్త. చివరికి భార్యను హత్య చేసిన ఆందోళనతో అతను కూడా మామిడి చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన దాసరి అంజయ్యకి, యాదమ్మ అనే మహిళకు దాదాపు 11 నెలల క్రితం వివాహమైంది. కాగా, ఈ దంపతులిద్దరూ రాంపూర్ తండా రోడ్డు మార్గంలో ఉన్న ఒక మామిడితోటలో నివాసం ఉంటున్నారు.

అయితే, పెళ్లయినప్పటి నుంచి తనకు కొత్త బైక్ కొనివ్వాలంటూ అంజయ్య తన అత్త మామలపై ఒత్తిడి చేస్తున్నాడు. ఈ బైక్ విషయంలో గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అంజయ్య తల్లి మామిడి పండ్లు అమ్మడానికి సదాశివపేటకు వెళ్లగా.. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు. ఇదే సమయంలో అంజయ్య.. యాదమ్మ మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త అంజయ్య.. ఆవేశంలో యాదమ్మను గదిలో చున్నీతో ఉరివేసి హత్య చేశాడు. తను చేసిన తప్పు గుర్తు చేసుకుని భయపడ్డ అంజయ్య.. భార్యను చంపేసినందుకు పోలీసులు కేసు పెట్టి జైల్లో వేస్తారని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అందుకే ఇక తాను కూడా బతకకూడదని నిర్ణయించుకుని, భార్య శవాన్ని గదిలోనే వదిలేసి.. ఘటనాస్థలికి కొద్దిదూరంలో మామిడి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఇద్దరికి పెళ్లి అయ్యి ఏడాది కూడా పూర్తి కాకుండానే ఇలా బైక్ కోసం గొడవపడి ఇద్దరి ప్రాణాలు పోవడం రెండు కుటుంబాలతోపాటు స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *