మూడేళ్లు సోషల్ మీడియాకు దూరం.. 3 సార్లు ఫెయిల్.. UPSC ర్యాంకర్ నేహా సక్సెస్ స్టోరీ
దేశ పరిపాలనా సేవల్లో చేరాలని నేహా బ్యాడ్వాల్ కూడా వేలాది మంది సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మాదిరిగానే కలలు కనింది. భారతదేశంలో అత్యంత కఠినమైన పోటీ పరీక్షల్లో ఒకటైన యూపీఎస్సీ కోసం ఆమె పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. అయితే మొదటి ప్రయత్నంలో విజయం దక్కలేదు. మరింత ఆత్మవిశ్వాసంతో రెండోసారి పరీక్ష రాసినా ఫలితం అనుకూలంగా రాలేదు. మూడో ప్రయత్నం కూడా నిరాశనే మిగిల్చింది. అయినప్పటికీ నేహా తన లక్ష్యాన్ని వదులుకోలేదు. తన లోపాలను గుర్తిస్తూ, సన్నద్ధతను మరింత మెరుగుపరుచుకుంటూ…
