ప్రపంచాన్ని ఏకం చేసేది కృష్ణ చైతన్యమే.. న్యూయార్క్ ఇస్కాన్ ఆలయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూజలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అమెరికా పర్యటనలో ఉన్న ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్ భగవత్ న్యూయార్క్లోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నిరాశ్రయులకు ఆహార పంపిణీ చేసే సేవా కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ భక్తులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నేటి సమాజంలో విభేదాలు, వైరుధ్యాలు పెరిగిపోతున్న తరుణంలో కృష్ణ చైతన్యమే ప్రపంచాన్ని ఏకం చేయగలదని మోహన్ భగవత్ తెలిపారు. ‘‘ప్రస్తుత ప్రపంచంలో అనేక రకాల…
