తాజావార్తలు

పెద్దలు ఇచ్చిన ఆరోగ్య మంత్రం.. ఉదయాన్నే ఇది తింటే రోగాలు పరార్.. బాడీ ఉక్కులా ఉంటుంది..

పెద్దలు ఇచ్చిన ఆరోగ్య మంత్రం.. ఉదయాన్నే ఇది తింటే రోగాలు పరార్.. బాడీ ఉక్కులా ఉంటుంది..


పూర్వం మన భారతీయులు, ముఖ్యంగా దక్షిణాది ప్రజలు, చద్దన్నంతో తమ దినచర్యను ప్రారంభించేవారని, దీనివల్ల జీర్ణ సమస్యలు తక్కువగా ఉండేవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చద్దన్నం ఎన్నో సమస్యలకు పరిష్కారంగా మారుతుంది.. ఇది ఆహారాన్ని పాక్షికంగా జీర్ణం చేసి, శరీరానికి సులభంగా అందుబాటులోకి తెస్తుంది, తద్వారా గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. వాస్తవానికి రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు పోసి మరుసటి రోజు ఉదయం తీసుకునే చద్దన్నం ఒక అద్భుతమైన, సహజమైన ప్రోబయోటిక్ అల్పాహారంగా పేర్కొంటారు. ఇది శరీరానికి చలువ చేయడంతోపాటు.. విటమిన్ బి12ను అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. నిపుణుల ప్రకారం.. ప్రోబయోటిక్స్ తీసుకోవడం చాలా మంచిది.

చద్దన్నం తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:

సహజ ప్రోబయోటిక్స్: అన్నం రాత్రంతా పులియడం వల్ల (fermentation) మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

శరీరానికి చలువ: చద్దన్నం తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి, వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొంటున్నారు.

పోషకాల పెరుగుదల: నిపుణుల ప్రకారం.. అన్నాన్ని నానబెట్టడం వల్ల సాధారణ అన్నంతో పోలిస్తే ఐరన్, కాల్షియం, విటమిన్ బి6, బి12 వంటి పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి.

బరువు నియంత్రణ: ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉండి, ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని అస్తుంది. దీంతో బరువు తగ్గవచ్చు.. మధుమేహం ఉన్నవారికి కూడా చద్దన్నం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అల్సర్లు, మలబద్ధకం దూరం: కడుపులో మంట, అల్సర్లు, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో చద్దన్నం, దాని నీరు బాగా పనిచేస్తాయి.

అందుకే.. ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద నిపుణులు, పెద్దలు చద్దన్నం రెగ్యూలర్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు.

చద్దన్నం కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.. మట్టి పాత్రల్లో లేదా ఓ గిన్నెలో మిగిలిపోయిన అన్నం కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, ఒక్క పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఉప్పు వేసి రాత్రి కలిపి పెట్టాలి.. దీన్ని ఉదయాన్నే తినాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *