తాజావార్తలు

Telangana: ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి.. ప్రియుడు చేసిన పనికి అంతా షాక్.. సీన్ కట్‌చేస్తే..

Telangana: ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి.. ప్రియుడు చేసిన పనికి అంతా షాక్.. సీన్ కట్‌చేస్తే..


తాను ప్రేమించిన అమ్మాయికి ఇంట్లో వాళ్లే వేరే పెళ్లి చేస్తున్నారని.. తెలిసి ఆ పెళ్లిన ఆపేందుకు యువకుడు పెళ్లి కొడుకు గ్రామంలో ప్రేయసితో ఉన్న ఫోటోలు కలిగిన పోస్టర్‌లు అంటించిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. అయితే ఇది జరిగిన రెండ్రోజుల తర్వాత సీన్‌ మొత్తం మారిపోయింది. పోస్టర్లు అంటించిన యువకుడితో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు పోలీసులు.

ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దూరమైపోతుందో అని ఆవేశంలో ఓ యువకుడు చేసిన పని.. చివరకు అతనితో పాటు స్నేహితులను కూటా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. ప్రేమ పేరిట ఓ యువకుడు చేసిన పిచ్చిపని అతన్ని కటకటాల పాలు చేసింది. దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. అయితే, ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ఒక యువకుడితో వివాహం నిశ్చయించారు. నిశ్చితార్థం కూడా ముగిసి, పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి.

అయితే తాను ప్రేమించిన యువతి వేరొకరి సొంతం కాబోతుందనే విషయాన్ని వెంకటేష్ తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఆ పెళ్లిని ఆపాలని ప్లాన్ వేశాడు. తాను, ఆ యువతి ప్రేమించుకుంటున్నట్లు, తమ మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ కొన్ని పోస్టర్లను డిజైన్ చేశాడు. ఆ పోస్టర్లను తీసుకుని, యువతికి కాబోయే భర్త స్వగ్రామమైన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, గోడలపై ఆ పోస్టర్లను అంటించి కలకలం సృష్టించాడు. ఉదయాన్నే లేచి చూసిన వరుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆ పోస్టర్లను చూసి షాక్‌కు గురయ్యారు.

ఈ విషయం కాస్తా వధువు కుటుంబ సభ్యులకు చేరింది..పెళ్లి చెడగొట్టేందుకే వెంకటేష్ ఈ నీచమైన పనికి ఒడిగట్టాడని గ్రహించిన యువతి కుటుంబ సభ్యులు తక్షణమే సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుపై అత్యంత వేగంగా స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ పేరుతో అవతలి వారి జీవితాలను రోడ్డున పడేసేలా ప్రవర్తించిన వెంకటేష్ ఉదంతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. క్షణికావేశంలో చేసిన ఈ పని వల్ల అటు యువతి కుటుంబం మానసిక క్షోభకు గురికావడమే కాకుండా, ఇటు యువకుడు, అతనికి సహకరించిన స్నేహితుల జీవితాలు కూడా జైలుపాలయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *