Festival Travel Alert: పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పాలమూరు పోలీసుల కీలక సూచనలు
Festival Travel Alert: దసరా పండుగ.. విద్యాసంస్థలకు సెలవులు.. కుటుంబంతో కలిసి సొంతూళ్లకు వెళ్లేందుకు చాలామంది సిద్ధమవుతున్నారు. అయితే పండగ సందడిలో ప్రయాణ ఏర్పాట్లపై చూపించే శ్రద్ధ.. ఇంటి భద్రతపై కూడా చూపించాల్సిన అవసరం ఉంది. చిన్న నిర్లక్ష్యం మీ ఇంటి భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉంది. అందుకే పండగ వేళ మహబూబ్నగర్ జిల్లా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు ఊళ్లకు వెళ్లే ముందు ఇంటి తలుపులు, కిటికీలు సక్రమంగా మూసివేయాలని, విలువైన వస్తువులు,…
