శ్రీసిటీ టిల్ హెల్త్ కేర్లో ఘోర ప్రమాదం.. బాయిలర్ బ్లాస్ట్తో నలుగురు కార్మికులు మృతి!
తిరుపతి జిల్లా శ్రీసిటీలో భారీ పేలుడు సంభవించింది. సత్యవేడు మండలంలోని శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. అయితే మృతుల సంఖ్యపై శ్రీసిటీ యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో నైట్ షిఫ్ట్ కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది…
