భూకంపాన్ని ముందే గుర్తించి హెచ్చరించిన ఆండ్రాయిడ్ ఫోన్లు..! ఎలా సాధ్యమైంది
భూకంపం సంభవించినప్పుడు ప్రతి సెకను ప్రాణాలను కాపాడుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే యాక్సిలరోమీటర్ సెన్సార్ల సాయంతో గూగుల్ ప్రపంచవ్యాప్తంగా భూకంపాలను ముందే గుర్తిస్తోంది. వెనిజులా దుర్ఘటనలో వందలాది ప్రాణాలను కాపాడిన ఈ ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఈ వ్యవస్థ మన భారత్‌లో ఎలా అందుబాటులో ఉంది? అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం! భూకంపాలను ఫోన్ ఎలా గుర్తిస్తుంది? ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ‘యాక్సిలరోమీటర్’ అనే చిన్న సెన్సార్ ఉంటుంది. మనం ఫోన్‌ను తిప్పినప్పుడు…
