ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంతువు దగ్గరకు మోదీ.. భారత్-సీషెల్స్ సరికొత్త దౌత్యానికి ‘జోనాథన్’ ప్రతీక!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (జూన్ 27) తన మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారతదేశానికి, హిందూ మహాసముద్ర ద్వీపసమూహమైన సీషెల్స్‌కు మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ పర్యటనలో అత్యంత ఆసక్తికరమైన ముఖ్యాంశం ఏమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ భూచర జంతువుగా గిన్నిస్ రికార్డు సృష్టించిన ‘జోనాథన్’ అనే…
