RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. ముఖ్యంగా చిత్రం, నువ్వు నేను వంటి చిత్రాల సంగీత ప్రయాణం, గాజువాక పిల్ల పాట సృష్టించిన ప్రభావం, ఆయన కెరీర్ ఎంపికల గురించి మాట్లాడారు. చిత్రం సినిమాకు సంగీతం అందించడం తన కెరీర్‌లో ఒక మైలురాయి అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. ఈ సినిమా పాటల…
