
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో యూత్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అయితే ఆ తర్వాత వరుణ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడ్డాయి. దీంతో ఈ ట్యాలెంటెడ్ హీరో క్రమంగా ఫేడవుట్ అయిపోయాడు. అయితే మధ్యలో కొన్నేళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే ఇప్పుడు మళ్లీ హీరోగా సినిమాలు చేస్తున్నాడు వరుణ్ సందేశ్. నింద, విరాజి, కానిస్టేబుల్ సినిమాలతో పాటు నయనం వంటి వెబ్ సిరీస్ లతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు వరుణ్. బ్లాక్‌మెయిల్, నా వైఫ్ మిస్సింగ్, చిత్రం చూడరా సినిమాలతో పాటు యద్భవం తద్భవతి మూవీలోనూ హీరోగా నటిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.
కాగా ఇవాళ (జులై 21) వరుణ్ సందేశ్ పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా తన సతీమణితో కలిసి ఓ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు వరుణ్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే క్రమంలో తనకు సినిమా ఇండస్ట్రీలో ఉండడానికి కారణమైన ఇద్దరు ప్రముఖులకు రుణపడి ఉంటానంటూ ఎమోషనల్ అయ్యాడు.
భార్యతో వరుణ్ సందేశ్..
View this post on Instagram
‘నేను ఇంటర్ చదివే సమయంలో ఓ గ్రాసరీ షాప్‌లో పనిచేశాను. అంతేకాకుండా క్యాషియర్‌గా కూడా పని చేశాను. నాకు సినిమా ఇండస్ట్రీలో నిర్మాత దిల్ రాజు, హీరో అల్లరి నరేష్ సాయం చేశారు. నా సినిమా కెరీర్‌లో ఎన్నో ఎత్తు, పల్లాలు చూశాను. నా కెరీర్ డౌన్‌ఫాల్‌లో ఉన్నప్పుడు డీ ఫర్ దోపీడి సినిమాలో దిల్ రాజు ఛాన్స్ ఇచ్చాడు. అందుకు ఆయనకు ఎప్పుడూ రుణ పడి ఉంటాను. అలాగే అల్లరి నరేశ్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ గుర్తుంటుంది. సినిమా ఇండస్ట్రీలో నా కష్టాల్లో అండగా నిలిచిన వీరిద్దరిని ఎప్పటికీ మరిచిపోలేను’ అని ఎమోషనల్ అయ్యాడు వరుణ్ సందేశ్. ప్రస్తుతం ఈ హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
