మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే దానిని అప్పుడప్పుడు ఉపయోగించండి. కరెంట్, వాటర్, గ్యాస్ లాంటి యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు ఉపయోగించండి. పెట్రోల్ ఖర్చుల కోసం కూడా వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత గడువులోగా బిల్లు చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. అత్యవసర సమయాల్లో మీకు క్రెడిట్ పరిమితి కూడా ఉంటుంది. దీంతో క్రెడిట్ కార్డును యాక్టివ్గా ఉంచుకోవడం ఉత్తమం.
