తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ప్రత్యేక రైలును భక్తుల కోసం ప్రకటించింది. తిరుపతి వెళ్లే రైళ్లు ఎప్పుడూ రద్దీతో ఉంటాయి. తరచూ లక్షలాది మంది తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి బస్సు మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. దీంతో తిరుపతి మార్గంలో నడిచే రైళ్లల్లో రద్దీని తగ్గించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా మరో స్పెషల్ ట్రైన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. తెలంగాణ, ఏపీ నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. ఈ రైలు వివరాలు, టైమింగ్స్ ఇప్పుడు చూద్దాం.
సికింద్రాబాద్ టు తిరుపతి స్పెషల్ ట్రైన్
సికింద్రాబాద్- తిరుపతి ప్రత్యేక రైలు (ట్రైన్ నంబర్ 070199)ను ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ట్రైన్ నవంబర్ 24వ తేదీన సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. అనంతరం మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది.
ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..?
ఈ స్పెషల్ ట్రైన్ లింగంపల్లి, వికారాబాద్, రాయిచూర్, ఆదోని, గుంతకల్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, ముల్కలచెరువు, మదనపల్లె రోడ్డు, కలికిరి, పీలేరు, పాకాల జంక్షన్ స్టేషన్లలో ఆగనుందని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు. ఈ స్పెషల్ రైలులో చైర్ కార్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు, ముఖ్యంగా శ్రీవారి భక్తులు ఈ రైలును ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతికి అనేక రైళ్లు నడుస్తున్నాయి. నారాయణాద్రి, వెంకటాద్రి, రాయలసీమ ఎక్స్‌ప్రెస్, కృష్ణా ఎక్స్‌ప్రెస్, శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ వంటివి రోజూ నడుస్తున్నాయి. ఇక వీక్లీ ట్రైన్లు కూడా చాలా నడుస్తుండగా.. వీటికి అదనంగా ప్రతీ వారంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఇక తిరుపతికి సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఉదయం 6.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మధ్యాహ్నం 02.35 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. 8 గంటల 25 నిమిషాల్లోనే ఇది తిరుపతికి చేరుకుంటుంది. ఇక పద్మావతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ వారంలో మూడు రోజులు కాచిగూడ నుంచి తిరుపతికి అందుబాటులో ఉన్నాయి
