తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. నేడు ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టం చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణలోని పలు జిల్లాల్లో పొడి వాతావరణం ఉండొచ్చని.. అలాగే కొన్ని జిల్లాల్లో పాక్షికంగా మేఘావృతమై ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 30°C వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఏపీలో వాతావరణం ఇలా..
నైరుతి బంగాళాఖాతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. కోస్తాంధ్ర, యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కి.మీ., గరిష్ఠంగా 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. పొగమంచు కురిసే అవకాశం కూడా ఉందని అంచనా వేసింది.
రాయలసీమలో వాతావరణం..
ఇక ఈ రోజు రాయలసీమలోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 30 నుండి 40 కి.మీ., గరిష్ఠంగా 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
