తెలుగు సినిమా తొలి స్టార్ కమెడియన్.. శత్రువుకు కూడా ఈయన లాంటి మరణం రాకూడదు
తెలుగు సినిమా చరిత్రలో తొలి స్టార్ కమెడియన్గా ఒక వెలుగు వెలిగి, అపారమైన కీర్తి ప్రతిష్టలను, సంపదను చూసిన కస్తూరి శివరావు జీవితం దురదృష్టవశాత్తూ విషాదభరితంగా ముగిసింది. “తొలి రోజుల్లో సైకిల్ తొక్కుకుంటూ తిరిగాను, నటుడయ్యాక ఖరీదైన కార్లలో తిరిగాను, ఇప్పుడు మళ్ళీ సైకిల్ మీదే తిరుగుతున్నాను” అని తన దుస్థితిపై తానే జోకులేసుకున్న శివరావు, తన జీవన ప్రస్థానంలో ఎన్నో వైరుధ్యాలను చూశారు. కాకినాడకు చెందిన మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శివరావు, ఇంటర్ వరకు…
