పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఎందుకు అంత ముఖ్యమో తెలుసా? తీర్థయాత్రల వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యాలు!
భక్తులు పుణ్యక్షేత్రాలు, ఆలయాలను సంచరించడం వెనుక ఎన్నో లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. క్షేత్రం అనగా పవిత్రమైన భూమి, ఆలయం అంటే ఆ పవిత్ర భూమిలో నిర్మించిన మందిరం. ఈ క్షేత్రాలు భక్తులకు ఆధ్యాత్మిక ఉన్నతికి, భగవత్ సాక్షాత్కారానికి ఆలంబనము వంటివి. కేవలం ఇంట్లో కూర్చుని భగవంతుడిని తలచుకుంటే సరిపోదని, క్షేత్ర సంచారం ద్వారా పొందే అనుభూతి విశిష్టమైనదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పుణ్యక్షేత్రాలు మహాత్ములు, ఋషులు తపస్సు చేసిన, సంచరించిన ప్రదేశాలు. వారి పవిత్ర పాదధూళి,…
