తాజావార్తలు

Peddi Movie: విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్.. అందరి కళ్లు ఆ గ్రాండ్ వేడుకపైనే..

Peddi Movie: విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్.. అందరి కళ్లు ఆ గ్రాండ్ వేడుకపైనే..


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హేప్ క్రియేట్ చేయగా, ప్రస్తుతం అందరి కళ్ళు ఈరోజు జరగబోయే గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పైనే పడ్డాయి. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ ప్రమోషన్స్‌లో భాగంగా, మేకర్స్ నేడు (జూన్ 1) విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి టీమ్ సభ్యులు చాలా తక్కువ సమాచారాన్ని మాత్రమే పంచుకున్నారు. కానీ, ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ముందుకు వస్తుంది పెద్ది టీమ్.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

ఈ వేడుకలో చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్‌ను ఏ రేంజ్‌లో చూపించబోతున్నారు. అలాగే సినిమాలోని హైలైట్స్ ఏంటి అనే విషయాలపై మేకర్స్ మాట్లాడే మాటల కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. విజయవాడలో జరిగే ఈ ఈవెంట్‌కు భారీ ఎత్తున అభిమానులు తరలిరానున్నారు. కేవలం సినిమా ప్రమోషన్స్ మాత్రమే కాకుండా, ఏపీలో ప్రీమియర్స్ , టికెట్ ధరలకు సంబంధించిన అధికారిక సమాచారం కూడా ఇప్పటికే వచ్చేయడంతో సినిమాపై మరింత జోష్ పెరిగింది.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

ఈ సాయంత్రం జరగబోయే ‘పెద్ది’ గ్రాండ్ ఈవెంట్ ఏ రేంజ్‌లో బాక్సాఫీస్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుందో, అలాగే మెగాపవర్ స్టార్ స్పీచ్ ఏ స్థాయిలో ఉండబోతుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అలాగే ఇందులో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *