తాజావార్తలు

NTPCలో 135 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. రూ.2 లక్షల వరకు జీతం, చివరి తేదీ ఇదే!


NTPC Recruitment 2026 Telugu: దేశంలోని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC)లో ఉద్యోగం పొందాలనుకునే అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ నిపుణులకు మంచి అవకాశం వచ్చింది. NTPCలో డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రికల్, మెకానికల్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ (C&I) విభాగాల్లో మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆగస్టు 12, 2026 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 26, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు E4 గ్రేడ్‌లో నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000 వరకు జీతం లభిస్తుంది.

వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 40 సంవత్సరాలు. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హత

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో ఫుల్‌టైమ్ BE/B.Tech డిగ్రీని కనీసం 60 శాతం మార్కులతో లేదా తత్సమాన CGPAతో పూర్తి చేసి ఉండాలి.
  • డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్): ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో ఫుల్‌టైమ్ BE/B.Tech ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
  • డిప్యూటీ మేనేజర్ (మెకానికల్): మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో ఫుల్‌టైమ్ BE/B.Tech డిగ్రీ ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి.
  • డిప్యూటీ మేనేజర్ (C&I): ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో ఫుల్‌టైమ్ BE/B.Tech డిగ్రీ ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

10 ఏళ్ల పని అనుభవం తప్పనిసరి

  • ఈ పోస్టులకు కేవలం విద్యార్హత ఉంటే సరిపోదు. సంబంధిత రంగంలో కనీసం 10 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
  • ఎలక్ట్రికల్: పవర్ సెక్టార్ లేదా ప్రాసెస్ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • మెకానికల్: పవర్ సెక్టార్ లేదా ప్రాసెస్ ఇండస్ట్రీస్‌లో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో కనీసం 10 సంవత్సరాల పని అనుభవం అవసరం.
  • C&I: పవర్ సెక్టార్ లేదా ప్రాసెస్ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ పదవిలో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం

అర్హత కలిగిన అభ్యర్థులు NTPC అధికారిక వెబ్‌సైట్ [www.ntpc.co.in](http://www.ntpc.co.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందు విద్యార్హత, వయోపరిమితి, పని అనుభవం తదితర అన్ని నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి. నిర్దేశిత అర్హతలు లేని అభ్యర్థుల దరఖాస్తులను నియామక ప్రక్రియలో తిరస్కరించే అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *