Cancer: ప్రాణాలను హరించే ఈ వ్యాధిని మన అలవాట్లతో అడ్డుకోవచ్చు.. ఎలాగంటే?
నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు చాప కింద నీరులా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇది తీవ్రమైన వ్యాధి అయినప్పటికీ సరైన జీవనశైలి, ఆహారాన్ని పాటించడం ద్వారా దీని ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జన్యువులకు సంబంధించిన కొన్ని కేసులు మినహా, చాలా వరకు క్యాన్సర్ కేసులు మన రోజువారీ అలవాట్లు, ఆహారానికి సంబంధించినవేనని డాక్టర్ రోహిత్ కపూర్ అంటున్నారు. అందువల్ల, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడటానికి ఎలాంటి…
