ఐపీఎల్‌లో సంచలనాత్మక ట్రేడ్ డీల్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హార్థిక్ పాండ్యా వచ్చే సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ను వీడే అవకాశాలు ఉన్నాయని, అతడిని దక్కించుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ నెలకొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం.. కేకేఆర్ యాజమాన్యం, ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మధ్య ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌కు రెండోసారి చేరిన తర్వాత పాండ్యా ప్రయాణం ఆశించిన స్థాయిలో సాగలేదు. అతని నాయకత్వంలో జట్టు ఒకసారి మాత్రమే ప్లే-ఆఫ్స్‌కు చేరుకోగలిగింది. 2026 సీజన్‌లోనూ ముంబై నిరాశాజనక ప్రదర్శన చేయడంతో పాండ్యా భవిష్యత్తుపై ఊహాగానాలు మరింత పెరిగాయి.
కేకేఆర్ ప్రస్తుతం శాశ్వత కెప్టెన్ కోసం వెతుకుతోంది. అందుకే పాండ్యాను జట్టులోకి తీసుకురాగలిగితే కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల నియమితుడైన అజింక్యా రహానె తాత్కాలిక ఎంపిక మాత్రమేనని, భవిష్యత్తు కోసం కేకేఆర్ పాండ్యాపై దృష్టి పెట్టిందని వార్తలు వస్తున్నాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. పాండ్యాకు బదులుగా యశస్వి జైస్వాల్‌ను ముంబై ఇండియన్స్ కోరుతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చర్చలు ఎంతవరకు ముందుకు వెళ్లాయన్నది స్పష్టత లేదు. అయితే హార్ధిక్ పాండ్యా కోసం కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్ ట్రేడ్ నిబంధనల ప్రకారం ఆటగాడు నేరుగా మరో ఫ్రాంచైజీతో చర్చలు జరపలేడు. ముందుగా ఫ్రాంచైజీల మధ్య ఒప్పందం కుదరాలి. అనంతరం ఆటగాడి సమ్మతి తప్పనిసరి. ఆటగాడు అంగీకరించకపోతే ట్రేడ్ అమలు కావడం సాధ్యం కాదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఒకవేళ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడితే, రాజస్థాన్ కంటే కేకేఆర్‌నే అతనికి మరింత అనుకూల గమ్యస్థానంగా క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
