బాధితులకు రూ. 32,600 కోట్లు తిరిగిచ్చిన ఈడీ
దేశవ్యాప్తంగా వివిధ ఆర్థిక మోసాలకు గురైన సామాన్య బాధితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ ఊరటనిచ్చింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 32,600 కోట్లకు పైగా విలువైన ఆస్తులను బాధితులకు తిరిగి అప్పగించి సరికొత్త చరిత్ర సృష్టించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి బాధితులకు చేరిన నగదు, ఆస్తుల మొత్తం రెట్టింపు కావడం విశేషం. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులకు, మదుపరులకు, ఇళ్ల కొనుగోలుదారులకు ఈడీ వేగంగా బదిలీ చేస్తోంది. గడిచిన ఆర్థిక…
