బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య.. ప్రియుడితోపాటు భార్య అరెస్ట్!
దుగ్గిరాల, జనవరి 27: బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తకు ప్రేమగా ఒడ్డించింది ఓ ఇల్లాలు. ఆనక భర్త మత్తులోకి జారుకోవడంతో ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు భార్యను అందుకు సహకరించిన ప్రియుడిని, ఆర్‌ఎంపీని అరెస్ట్ చేసి.. కటకటాల్లో వేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన…
