బాలీవుడ్ ప్రముఖ రాపర్ బాద్షా, పంజాబీ నటి ఇషా రాఖీ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పెళ్లయిన కేవలం ఐదు నెలలకే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారి ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది కూడా రహస్యంగా.. అలాంటిది ఇప్పుడు కేవలం ఐదు నెలలకే విడాకులు తీసుకుని విడిపోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సింగర్ బాద్షా ఇషాకు భరణంగా ఎంత డబ్బు చెల్లించాడనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా బాద్షా, ఇషాల మధ్య మనస్పర్థలు వచ్చాయన్న వదంతులు వినిపిస్తున్నాయి. ఇషా పెట్టిన ఒక పోస్ట్ వల్ల ఈ రూమర్లు మొదలయ్యాయి. ఇప్పుడు వారిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సింగర్ బాద్షా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పంచుకున్నారు, “నేను, ఇషా రిఖి పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాము. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతను గౌరవించమని మీ అందరినీ కోరుతున్నాం’ అని రాసుకొచ్చారు బాద్ షా.
కాగా బాద్షా మొదటిసారిగా 2012లో జాస్మిన్ మసీహ్ వివాహం చేసుకున్నారు. కానీ 2020లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత, 2026 మార్చిలో, బాద్షా పంజాబీ నటి ఇషాను వివాహం చేసుకున్నారు. కానీ ఈ వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఇప్పుడీ వారు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయితే వీరు తమ భరణం లేదా ఆర్థికపరమైన సెటిల్మెంట్లకు సంబంధించిన ఎలాంటి వివరాలను వారు వెల్లడించలేదు.
ఇవి కూడా చదవండి
ఇక ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా అలియాస్ బాద్షా స్వతహాగా పంజాబీ. హిందీ, పంజాబీ భాషల్లో ఎక్కువగా పాటలు పాడుతుంటాడు. సొంత ఆల్బమ్ సాంగ్స్‌తో పాటు సినిమాల్లోనూ పాటలు పాడుతుంటాడు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ‘సాహో’లో బ్యాడ్ బాయ్ పాట పాడింది బాద్ షానే. అలాగే అజిత్ నటించిన ‘వేదాళం’లో అలుమా డోలుమా పాటతోనూ దక్షిణాది ఆడియెన్స్ కు దగ్గరయ్యాడీ స్టార్ సింగర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
