బాలీవుడ్ స్టార్స్ పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ యాక్షన్ డ్రామా ‘మిర్జాపూర్ ది మూవీ’. టాప్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. ‘మిర్జాపూర్ ది మూవీ’ సెప్టెంబర్ 4న హిందీ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మిర్జాపూర్ ది మూవీ’ చిత్ర బృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ప్రెస్ మీట్ లో పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. మిర్జాపూర్ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేము దీన్ని పెద్ద స్క్రీన్‌పై చూసేలా ఈ సినిమాగా తీసుకొచ్చాం. మీ అందరితో పాటు తెలుగు ట్రైలర్‌ను ఇక్కడ చూడడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను చేసిన కాలీన్ భయ్యా క్యారెక్టర్‌కు ప్రేక్షకులు ఎంతగానో అభిమానం చూపించారు. తెలుగు ఆడియన్స్ కాలీన్ భయ్యా అని పిలిచారు. తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.
దివ్యేందు శర్మ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. మిర్జాపూర్ సిరిస్ పెద్ద విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో అభిమానించారు. ఇది చాలా రియలిస్టిక్‌గా సాగే కథ. సినిమాలో కూడా అదే రియలిస్టిక్నెస్ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రేక్షకులు చాలా పరిణతి చెందారు. వాళ్లు ఎలాంటి సినిమా చూడబోతున్నారో వారికి ముందే ఒక అవగాహన ఉంటుంది. ఇది స్టాండలోన్ ఫిల్మ్. సిరీస్‌లో ఒక్క ఎపిసోడ్ చూడకపోయినా సరే థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో క్యారెక్టర్లు అవే ఉంటాయి. కానీ ఇందులో సిచ్యువేషన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. సినిమా షూటింగ్ వస్తున్నప్పుడు మిర్జాపూర్కు ప్రేక్షకులు ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్థమైంది. అందుకే ఈ సినిమాను తెలుగులో డబ్ చేయాలని భావించాము. తప్పకుండా తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.
అలీ ఫజల్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. మిర్జాపూర్ మూవీ టోటల్‌గా ఒక ఫ్రెష్ ఫిల్మ్. క్యారెక్టర్స్ ఎసెన్స్ అదే అయినప్పటికీ సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. సినిమాలో చాలా కొత్త టర్న్‌లు ఉంటాయి. ఇందులో అన్నీ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్. గుడ్డు, బీనా, బబ్లు అందరూ ప్రేక్షకులకు ఎంతో పరిచయమైన క్యారెక్టర్స్. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరణ ఇచ్చారు. తప్పకుండా మిర్జాపూర్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుంది.
రవి కిషన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు ‘మద్దాలి శివారెడ్డి’ క్యారెక్టర్‌ను ఎంతగానో అభిమానించారు. తెలుగులో నేను చేసిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఇచ్చాయి. ఇందులో నేను బబ్బన్ యాదవ్ అనే క్యారెక్టర్ చేశాను. ఇది సిరీస్‌లో లేని, సినిమాలో కొత్త క్యారెక్టర్. మీకు తెలుసు ఇది చాలా పవర్ఫుల్ గ్యాంగ్. ఇది చాలా క్రేజీ ఫ్యామిలీ. ఇందులో నాది కొత్త క్యారెక్టర్. ఈ సినిమాలో పని చేసే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఒక ఓటీటీ సిరీస్ బిగ్ స్క్రీన్‌పై రావడం ఇదే ఫస్ట్ టైమ్. తప్పకుండా ఈ సినిమాను మీరు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు.
జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. మిర్జాపూర్ సూపర్‌హిట్ వెబ్ సిరీస్. ఇప్పుడు ఆ సిరీస్‌ను బిగ్ స్క్రీన్‌పైకి తీసుకురావడం, అలాగే తెలుగులో డబ్ చేయడం నాకు ఇంకా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సిరీస్‌ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈ సినిమాను కూడా అంతగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ‘పంచాయత్’, ‘కోట ఫ్యాక్టరీ’ సిరీస్‌లను కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు మిర్జాపూర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది.
డైరెక్టర్ గురుమీత్ సింగ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు సినిమాలను చాలా ఇష్టపడతారు. సినిమాను థియేటర్లో చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. తప్పకుండా ఈ సినిమాను మేము తెలుగులోకి తీసుకురావాలని అనుకున్నాము. బిగ్ స్క్రీన్‌పై మిర్జాపూర్ను తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. వెబ్ సిరీస్‌కు చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది. బిగ్ స్క్రీన్‌పై కూడా ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటారని నమ్ముతున్నాము. తెలుగులో మిర్జాపూర్కు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే తెలుగు లాంగ్వేజ్‌లోనే డబ్ చేసి, ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు ప్రత్యేకంగా తీసుకొస్తున్నాము.
రసిక దుగల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సిరీస్‌లోని నేను చేసిన క్యారెక్టర్‌కు ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమా కూడా మీ అందరినీ అలరిస్తుంది. సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. ఎన్ను ఎన్నో తెలుగు సినిమాలు చేశాను. ఇక్కడ నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. మిర్జాపూర్ సినిమాతో ఇక్కడికి రావడం ఇంకా ఆనందంగా ఉంది. తెలుగు ఆడియన్స్ ఇచ్చే ప్రేమ ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. సినిమాను, నటీనటులను అంతగా అభిమానిస్తారు. ఈ సినిమాకు కూడా అంతే ప్రేమ దొరుకుతుందని నమ్ముతున్నాను. శ్వేతా త్రిపాఠి మాట్లాడుతూ.. ‘మిర్జాపూర్ సిరీస్‌కు మీరందరూ ఇచ్చిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఈ సినిమాను తెలుగులో తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. తెలుగు ప్రేక్షకులు సిరీస్‌ను ఎంత ఎంజాయ్ చేశారో, ఈ సినిమాను కూడా అంతలానే ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు
శ్రియా మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. రానా గారి సినిమా కోసం నేను మొదటిసారి హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు మిర్జాపూర్తో రావడం చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా సెప్టెంబర్ 4వ తేదీన మీరందరూ ఈ సినిమాను థియేటర్లో చూసి సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక హర్షిత గౌర్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. విశ్వక్సేన్ గారి ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాలో నేను నటించాను. ఆ సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరణ చూపించారు. తెలుగు ప్రేక్షకులు కొత్త నటీనటులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. మిర్జాపూర్ సినిమా కూడా సెప్టెంబర్ 4న థియేటర్స్‌కు వస్తుంది. మీరందరూ బిగ్ స్క్రీన్‌పై ఈ సినిమాను ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
