Sobhan Babu : ఇండస్ట్రీలో విషాదం.. శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దివంగత నటభూషణ్, హీరో శోభన్ బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూశారు. చెన్నైలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న ఆమె.. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. శాంతకుమారి మరణవార్త తెలిసిన వెంటనే సినీ అభిమానులు, సినీ ప్రముఖులు, దిగ్ర్భాంతికి గురయ్యారు. శుక్రవారం (జూలై 10న) శాంతకుమారి అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించనున్నట్లు…
