వేసవి తాపం నుంచి కాపాడే 10 అద్భుతమైన ఇండియన్ డ్రింక్స్..! వీటితో హెల్త్, బాడీ కూలింగ్
వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే కేవలం నీళ్లు తాగితే సరిపోదు. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, పేగు ఆరోగ్యాన్ని పదిలపరిచే పానీయాలు మన సొంతం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన దేశంలో లభించే అద్భుతమైన వేసవి పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆమ్ పన్నా- పచ్చి మామిడికాయలు, పుదీనా, జీలకర్రతో చేసే ఈ పానీయం ఉత్తర భారతీయులకు ఎంతో ఇష్టం. ఇది ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతుంది. బాబ్రి బ్యోల్- కాశ్మీరీల ఫేవరెట్…
