నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. ఈ సినిమాకు రుద్ర అత్రి దర్శకత్వం వహించనున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్గా నటిస్తున్నారు. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ని, కాన్సెప్ట్ పోస్టర్ని బుధవారం నాడు రివీల్ చేశారు. విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్లోకి దిగడం, ఆ తర్వాత ఆ కుర్రాడి జీవితంలో ఎదురైన పరిస్థితుల్ని ‘పాకెట్ రాకెట్స్’లో ఎంతో ఆసక్తికరంగా చూపించబోతోన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. త్వరలో టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా వర్క్ చేయనున్నారు. ఈ మూవీకి గ్యానీ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్లు ఫేమ్), శ్రియా కొంతం (శుభం ఫేమ్), నిర్మల్ (డెబ్యూ హీరో), జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బ్యానర్లు : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్
నిర్మాతలు: పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి
దర్శకుడు :రుద్ర అత్రి
కెమెరామెన్ :ఎదురోలు రాజు
మ్యూజిక్ :గ్యానీ
ఎడిటర్ : అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ మన్యం
ప్రొడక్షన్ డిజైనర్ :విష్ణు వర్దన్ పుల్లా
యాక్షన్ కొరియోగ్రఫీ :రాజేష్ లంకా
కొరియెగ్రాఫర్ : జేడీ మాస్టర్
కాస్ట్యూమ్ డిజైనర్ : అనుషా దేవర
ఎస్ఎఫ్ఎక్స్ :సాయి మనీంధర్ రెడ్డి
కో డైరెక్టర్ :మురళీ కృష్ణ కట్టా
మేకప్ చీఫ్ :పసుపులేటి రవి కుమార్
కాస్ట్యూమ్ చీఫ్ :ఆర్. భూపాల్ రావు
ప్రొడక్షన్ కంట్రోలర్ : రవిందర్ బెక్కం
స్టిల్స్ : వరాహాల మూర్తి
ఈవెంట్ పార్టనర్: యువి మీడియా
మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ
పీఆర్వో : ఎస్.కె. నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
త్వరలోనే మరిన్ని వివరాలు..
Lights, camera, and roll! 🎰🎲
Unveiling #POCKETROCKKETS, the official title for #PepNxt. Fasten your seatbelts, because this journey is going to be absolute fire. 🔥
Bomma b̶l̶o̶c̶k̶b̶u̶s̶t̶e̶r̶e̶ Jackpot eh!
#NiharikaKonidela @Pinkelephant_P @maxcitystudios @Jd_Chakravarthy https://t.co/TsBJFWQvhX
— Pink Elephant Pictures (@PinkElephant_P) October 28, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
