రాజమండ్రిలో ఆవకాయ పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
వేసవి వచ్చిందంటే మామిడికాయలు..పచ్చళ్లు సందడి మొదలవుతుంది. వేసవిలో ఏడాదిపాటు నిల్వ ఉండేల రకరకాల ఆవకాయలు పెడతారు. పచ్చళ్లలో ఆవకాయ పచ్చడి రుచే వేరు అన్నట్టుగా.. ఎన్నిరకాల పచ్చళ్లు ఉన్నా ఆవకాయ ముందువరుసలో ఉంటుంది. ఇక గోదారోళ్లు ఎంతో సంప్రదాయబద్దంగా పెట్టే ఆవకాయకు డిమాండ్ మామూలుగా ఉండదు మరి. అందుకే ఆవకాయ పెట్టడంలో తన ప్రతిభను నిరూపించుకునేందుకు రంగంలోకి దిగారు మహిళామణులు. రాజమండ్రి అంటేనే రుచులకు పెట్టింది పేరు. ఆ రుచులకే మకుటాయమానంగా నిలిచే ‘ఆవకాయ’ తయారీలో ఇప్పుడు…
