వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్!
కడప, ఏప్రిల్ 20: ఎంతో విలువైన ప్రాణాలు చిన్న కారణాలకే కొందరు తృణప్రాయంగా వదిలేసుకుంటున్నారు. సెల్ ఫోన్ ఇవ్వలేదని, రిమోట్ లాక్కున్నారనీ, ఎక్కువ సమయం ఫోన్‌లో గడపొద్దన్నారనీ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇంట్లో స్టౌ పై మరుగుతున్న పాలు పొంగాయని భార్యపై కోపంతో ఏకంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో చోటు చేసుకుంది. ఎస్సై మహమ్మద్ రఫి తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లాలోని బాలాజీనగర్‌కు చెందిన వెంకట…
