Hyderabad: ఇకపై రాత్రి వేళల్లో కూడా బస్సు సర్వీసులు.. ఈ 6 మార్గాల్లో..
హైదరాబాద్‌లో రాత్రివేళ ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 29 నుంచి నగరంలోని ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రి బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఐటీ ఉద్యోగులు, హోటళ్లు, హాస్పిటాలిటీ రంగం, షాపింగ్ మాల్స్, రాత్రిపూట పనిచేసే ఇతర సంస్థల ఉద్యోగులు, పర్యాటకులు, సందర్శకుల ప్రయాణ అవసరాలను…
