రూ.3 కోట్ల స్కాలర్‌షిప్‌కి ఎంపికైన ఏకైక విద్యార్ధిని.. 18 ఏళ్ల ఈ అమ్మాయి కథ మీకు చెప్పాలి!
బీహార్ రాష్ట్రంలోని సివాన్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని శ్రేయా కౌశిక్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే లింకన్ స్కాలర్‌షిప్‌కు ఎంపింకైంది. ఈ ఏడాది లింకన్ స్కాలర్‌షిప్ పొందిన ఏకైక భారతీయురాలిగా శ్రేయా కౌశిక్ నిలిచింది. సుమారు రూ.3 కోట్ల విలువైన ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఆమె అమెరికాలోని సెంటర్ కాలేజీలో నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ విద్యను పూర్తిగా ఉచితంగా అభ్యసించనుంది. లింకన్ స్కాలర్‌షిప్ అంటే ఏమిటి? అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్…
