తాజావార్తలు

ONGC Scholarship 2026: నిరుపేద విద్యార్ధులకు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. ఈ స్కాలర్‌షిప్‌కు వెంటనే దరఖాస్తు చేయండి

ONGC Scholarship 2026: నిరుపేద విద్యార్ధులకు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. ఈ స్కాలర్‌షిప్‌కు వెంటనే దరఖాస్తు చేయండి


ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌లు ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్‌ అభ్యర్థులకు 500 చొప్పున స్కాలర్‌షిప్‌లను అందించనుంది. అలాగే అన్ని కేటగిరీల్లో 50 శాతం స్కాలర్‌షిప్పులు అమ్మాయిలకు కేటాయిస్తారు. ప్రస్తుతం సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్ధులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో మే 15, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో బీఈ/ బీటెక్‌ ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌, పీజీ స్థాయిలో జియాలజీ, జియోఫిజిక్స్‌, ఎంబీఏ కోర్సుల్లో దేనిలోనైనా 2025-26 విద్యా సంవత్సరంలో ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. అలాగే ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్‌, ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు కూడా డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల కంటే తక్కువ ఉండాలి. విద్యార్ధుల వయసు ఆగస్టు 1, 2025 నాటికి 30 ఏళ్లకు మించరాదు. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP)లో దరఖాస్తు చేసుకోవచ్చు. వేరే ఏ స్కాలర్‌షిప్‌లు పొందని వారు మాత్రమే ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌కు అర్హులు.

ఇవి కూడా చదవండి

ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎంపిక ఇలా..

ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ కోర్సులకు ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సులకు డిగ్రీ మార్కుల ఆధారంగా స్కాలర్‌షిప్పులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ విద్యార్ధులకు నాలుగేళ్లు, ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున స్కాలర్‌షిప్‌ చెల్లిస్తారు. ఇలా ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్పు అందుతుంది. మొత్తం కోర్సు పూర్తయేంత వరకు యేటా ఈ స్కాలర్ షిప్ అందుకోవచ్చు.

ఏయే కోర్సులకు ఎన్ని స్కాలర్‌షిప్‌లు ఉన్నాయంటే..

  • ఇంజినీరింగ్‌ కోర్సులో ఎస్సీ, ఎస్టీలకు 500, ఓబీసీలకు 300, జనరల్‌ అభ్యర్ధులకు 300 స్కాలర్‌షిప్‌లు
  • ఎంబీబీఎస్‌ కోర్సులో ఎస్సీ, ఎస్టీలకు 90, ఓబీసీలకు 50, జనరల్‌ అభ్యర్ధులకు 50 స్కాలర్‌షిప్‌లు
  • ఎంబీఏ కోర్సులో ఎస్సీ, ఎస్టీలకు 140, ఓబీసీలకు 50, జనరల్‌ అభ్యర్ధులకు 50 స్కాలర్‌షిప్‌లు
  • జియాలజీ/ జియోఫిజిక్స్‌ కోర్సులో ఎస్సీ, ఎస్టీలకు 270, ఓబీసీలకు 100, జనరల్‌ అభ్యర్ధులకు 100 స్కాలర్‌షిప్‌లు

ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ స్కాలర్‌షిప్‌లకు దేశంలోని మొత్తం రాష్ట్రాలను 5 జోన్లగా విభజించారు. ఒక్కో జోన్‌ నుంచి ఎస్సీ, ఎస్టీలకు 200, ఓబీసీలకు 100, జనరల్‌ అభ్యర్థులకు 100 చొప్పున వీటిని కేటాయిస్తారు. అభ్యర్థులు చదువుతోన్న కాలేజీ ఉన్న రాష్ట్రం ఆధారంగా జోన్‌ నిర్ణయిస్తారు. ఏపీ, తెలంగాణలు జోన్‌ 5లో ఉన్నాయి. ఎంపికైన విద్యార్ధులు ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ పొందాలంటే అన్ని సబ్జెక్టుల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత పొందాలి.

ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *