తాజావార్తలు

Gas Cylinder: బాబోయ్ జాగ్రత్త.. ఇంట్లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ గ్యాస్ సిలిండర్ ఎప్పుడైనా పేలొచ్చు..

Gas Cylinder: బాబోయ్ జాగ్రత్త.. ఇంట్లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ గ్యాస్ సిలిండర్ ఎప్పుడైనా పేలొచ్చు..


ప్రతీఒక్కరూ తమ ఇళ్లల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ వినియోగిస్తూ ఉంటారు. వేసవి కావడంతో గ్యాస్ సిలిండర్లు పేలుతున్న ఘటనలు ఇటీవల తరచూ ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటున్నాయి. సిలిండర్ల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒకసారి పేలితో ఇళ్లు మొత్తం దగ్దమై భారీ నష్టం చేకూరే అవకాశముంది. దీంతో ఇంట్లో వీటి వాడకంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల అది పేలిపోయే అవకాశముంటుంది. ఇంట్లో సిలిండర్లను వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి..? గ్యాస్ సిలిండర్ పేలుళ్లకు కారణమేమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పేలుళ్లకు కారణమేంటి..?

-లోపభూయిష్టమైన కనెక్షన్లు లేదా అరిగిపోయిన భాగాలు లీకులను సృష్టిస్తాయి. దీనివల్ల గ్యాస్ బయటకు పోయి ఒక పరిమిత ప్రదేశంలో పేరుకుపోతుంది. ఇలాంటి సమయంలో సిలిండర్లు పేలుతాయి
-సిలిండర్లను స్టవ్‌లు, ఓవెన్‌లు సూర్యరశ్మికి దగ్గరగా ఉంచడం వలన ప్రమాదకరమైన పీడన పెరుగుదల ఏర్పడవచ్చు. ఇటువంట సమయంలో ప్రమాదం ఏర్పడవచ్చు
-సిలిండర్లను కింద పడేయడం, గుద్దుకోవడం లేదా వాటితో చెలగాటం ఆడటం వల్ల సేఫ్టీ వాల్వ్ దెబ్బతిని గ్యాస్ విడుదలకు దారితీసినప్పుడు ప్రమాదం జరుగుతుంది
-సిలిండర్‌పై ఉన్న వాల్వ్ క్యాప్ లేదా సేఫ్టీ సీల్‌ను ట్యాంపరింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదం పొంచి ఉంటుది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

-ప్రత్యక్ష సూర్యరశ్మి, వేడి వనరులకు దూరంగా చల్లని, గాలి బాగా ప్రసరించే ప్రదేశంలో సిలిండర్‌ను నిటారుగా ఉంచాలి
-సిలిండర్, హోస్‌లో లీక్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి.
-ISI (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) మార్క్ ఉన్న ప్రెషర్ రెగ్యులేటర్, హోస్‌ను మాత్రమే ఉపయోగించండి
-సరైన పరీక్ష, ధృవీకరణను నిర్ధారించే అధీకృత డీలర్ల నుండి మాత్రమే ఎల్పీజీ సిలిండర్లను కొనుగోలు చేయండి
– గ్యాస్ లీక్ అవుతుందనే అనుమానం వస్తే.. వెంటనే సిలిండర్ వాల్వ్‌ను మూసివేమండి. గాలి ప్రసరణ కోసం కిటికీలను తెరవండి.
-స్విచ్‌లు, లైటర్లు లేదా సిగరెట్లను వెలిగించకండి
– ఆన్ చేసే ముందు సిలిండర్, కనెక్షన్ల చుట్టూ వాసన చూసి పరీక్షించండి. గ్యాస్ వాసన వస్తే లీక్ ఉన్నట్లు సూచిస్తుంది.
-ఉపయోగంలో లేనప్పుడు సిలిండర్ వాల్వ్ వద్ద గ్యాస్ సరఫరాను ఎల్లప్పుడూ ఆపివేయండి
-కనెక్షన్‌లను మార్చేటప్పుడు లేదా లీక్‌లను తనిఖీ చేసేటప్పుడు సిలిండర్ దగ్గర విద్యుత్ ఉపకరణాలను లేదా బహిరంగ మంటలను ఉపయోగించకండి

గ్యాస్ పేలుడు సంభవించినప్పుడు..

– వెంటనే పేలుడు సంభవించిన ప్రాంతాన్ని విడిచిపెట్టండి.
– గట్టిగా అరిచి పొరుగువారిని కూడా ఖాళీ చేయమని హెచ్చరించండి
– అగ్నిమాపక విభాగానికి, గ్యాస్ సరఫరాదారుకు కాల్ చేయండి
– అత్యవసర సిబ్బంది భవనం సురక్షితమని ప్రకటించే వరకు తిరిగి ప్రవేశించకండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *