తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అధినేత విజయ్ భారీ విజయం సాధించబోతున్నారు. నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కేవలం రెండు. మూడు స్థానాల్లో నిలిచాయి.ఈ నేపథ్యంలో విజయ్ గురించి ఆయన కుటుంబ సభ్యుల గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్ర శేఖర్ గురించి. విజయ్ స్టార్ హీరో అయితే చంద్ర శేఖర్ స్టార్ డైరెక్టర్. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. అలాంటి విజయ్ తండ్రికి, మెగాస్టార్ చిరంజీవికి ఓ సంబంధం ఉంది . అదే సినిమా బంధం. చంద్రశేఖర్ ఒక్క తమిళంలోనే కాదు తెలుగులోనూ సినిమాలు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అరడజనకు పైగా సినిమాలు తెరెకెక్కించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. విజయ్ తండ్రి చిరంజీవి సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటికి ఆయన తమిళంలో కేవలం మూడు సినిమాలను మాత్రమే తీశారు. అయినా చిరంజీవి ఆయనను నమ్మి తెలుగులో మొదటి సినిమా అవకాశం ఇచ్చారు. చంద్రశేఖర్ కూడా తనపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. మెగాస్టార్ రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా మర్చిపోలేని హిట్ సినిమా ఇచ్చాడు. అదే ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమా. 1981లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ సంచలనంగా నిలిచింది. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు.. అటు చిరంజవికి, ఇటు చంద్రశేఖర్‌కు తమ కెరీర్‌లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. చట్టానికి కళ్లు లేవు తర్వాత వీరి కాంబినేషన్ లో మరో రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండూ కూడా సూపర్ హిట్ అయ్యాయి. పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇలా వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు కమర్షియల్ హిట్స్ అయ్యాయి. ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. తెలుగులో ఎస్ ఏ చంద్రశేఖర్ ఆరు సినిమాలు తీస్తే అందులో మూడు మాత్రమే హిట్ అయ్యాయి. ఆ మూడు కూడా చిరంజీవి హీరోగా నటించిన సినిమాలే. అలా సినిమాల పరంగా ఎస్ ఏ చంద్ర శేఖర్, చిరంజీవి మధ్య మంచి అనుబంధం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajinikanth: ‘పీక్ క్రేజ్ వేస్టెడ్ తాత’ అంటూ రజినీ పై ట్రోల్స్
Thalapathy Vijay: ఒక్క ముక్కలో.. విజయ్ రాజకీయ, సినీ ప్రస్థానం
