TTD Kobbari Pachadi: తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి మొదటి ముద్ద తింటే వదిలిపెట్టడం ఎవరి వల్లా కాదు. చాలామంది పచ్చి కొబ్బరిని నేరుగా రుబ్బుతుంటారు; కానీ తిరుమల దేవస్థానం స్టైల్లో పచ్చి కొబ్బరి ముక్కలను నూనెలో లేత బంగారు రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి, పచ్చిశనగపప్పు, ఘాటైన ఎండుమిర్చితో నూరుతారు. ఇలా చేయడం వల్ల పచ్చడికి తిరుగులేని కమ్మదనం రావడమే కాకుండా కనీసం 3 నుండి 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ…
