తాజావార్తలు

వేధింపులు తట్టుకోలేను.. విషమిస్తే నేనే చచ్చిపోతా

ఓ అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో జైలులో ఉన్న నటి పవిత్రా గౌడకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆమె ఇప్పటికే బెయిల్ పిటిషన్‌ దాఖలు చేసింది. తనకు బెయిల్ ఇ‍వ్వాలంటూ బెంగళూరు కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు విచారణలో పవిత్రా గౌడ తన బాధను న్యాయస్థానానికి వివరించింది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జైలులో తనను నైజీరియన్‌ మహిళా ఖైదీలు వేధిస్తున్నారని మరో పిటిషన్‌ దాఖలు చేసింది పవిత్ర. తనకు బెయిల్ ఇవ్వాలని.. లేనిపక్షంలో చనిపోయేందుకు…

Read More

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

Pooja Offerings Meaning Telugu: గుడిలో దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారో చాలామందికి సందేహం ఉంటుంది. ఈ నైవేద్య సమర్పణ కేవలం తమ కోరికలను తీర్చుకునే ఆచారం కాదని, దీని వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉందని పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతి ఎండవానలను తట్టుకొని ఫలాలను అందిస్తుంది. కానీ ఆ ఫలాలను తనకోసం దాచుకోదు. దాన్ని లోకానికి అందిస్తుంది. అదేవిధంగా, మనం దేవుడి ముందు పండును ఉంచినప్పుడు, ఇది నా కష్టార్జితం అనే…

Read More

The Paradise Review: ది ప్యారడైస్‌కు దిష్టి తగిలింది! సినిమాకు ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైస్ చిత్రం మంచి అంచనాలతో విడుదలైంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ముఖ్యంగా నాని అభిమానులు అతని యాక్షన్ అవతార్‌ను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే, మాలిక్ చేతిలో పీడించబడుతున్న జనాల నుంచి పుట్టుకొచ్చిన జడల్ అనే హీరో, తన సమూహం కోసం మాలిక్‌పై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో నాయకుడిగా ఎదుగుతాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కథ,…

Read More

తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25న ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Andhra Pradesh Weather Update Telugu: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎన్‌టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెప్టెంబర్ 25న (శుక్రవారం) ఒక రోజు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ గురువారం ఆదేశాలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో విద్యార్థులు…

Read More

Screen Protector: ఫోన్‌ స్క్రీన్‌ గార్డ్‌‌ల పై కేంద్రం కొత్త రూల్స్‌

స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో లభించే తక్కువ నాణ్యత కలిగిన స్క్రీన్ ప్రొటెక్టర్లు, టెంపర్డ్ గ్లాస్‌ల విక్రయాలకు అడ్డుకట్ట వేస్తూ కొత్త నిబంధనలను జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వీటిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) తప్పనిసరి రిజిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకువచ్చింది. 2027 ఏప్రిల్ 1 నుంచి భారత మార్కెట్లో ఐఎస్ 19348:2025 (IS 19348:2025) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న స్క్రీన్ ప్రొటెక్టర్లనే…

Read More

స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు.. శంకర్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే!

పట్టుదల, సరైన ప్రణాళిక ఉంటే ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు చెన్నైకి చెందిన శంకర్. స్విగ్గీలో ఫుడ్ డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తూ ఆయన గత 8 ఏళ్లలో ఏకంగా రూ.53 లక్షలు సంపాదించారు. ఈ స్ఫూర్తిదాయక కథనాన్ని స్విగ్గీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ లెక్కలను పరిశీలిస్తే శంకర్ సగటున ఏడాదికి రూ. 6.62 లక్షలు, నెలకు సుమారు రూ. 55,208 సంపాదించారు. ఈ ఆదాయంతోనే తన…

Read More

Andhra: ఇలాంటి మరణం ఎవరికీ రావొద్దు.. రేబిస్‌తో రెండేళ్ల బాలుడు మృతి..

కుక్క కాటును చిన్న విషయంగా తీసుకోవడం ఎంత ప్రమాదకరమో పల్నాడు జిల్లాలో జరిగిన విషాద ఘటన మరోసారి గుర్తు చేసింది. కుక్క కరిచిన తర్వాత సకాలంలో రేబిస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోకపోవడంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. రేబిస్‌ లక్షణాలు బయటపడిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు చిన్నారిని కాపాడలేకపోయారు. వినుకొండ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొగ్గరం గ్రామానికి చెందిన రెండేళ్ల…

Read More

22ఏపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

22ఏపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఉంటే 22ఏ పరిధిలో ఉన్నా రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయగా.. ఇవి తక్షణమే అమల్లోకి రానున్నాయి. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం…

Read More

అదేం శాడిజం రా.. ట్రైన్‌లోంచి ప్రయాణికులను తోసి చంపేస్తున్న సైకో కిల్లర్.. ఎందుకో తెలిస్తే..

సెప్టెంబర్ 19న ట్రైన్‌లోంచి ఓ ప్రయాణికుడిని కిందకు తోసేసి చంపేసిన ఘటనలో నిందితుడిని ఎట్టకేలకే అరెస్ట్ చేశారు వారణాసి పోలీసులు. నిందితుడిని భోజ్‌పూర్ జిల్లా బరిస్వాన్ గ్రామానికి చెందిన రోహిత్ తివారీగా గుర్తించారు. ఇతను గత కొద్ది రోజులుగా ట్రైన్‌లో నుంచి ప్రయాణికులను తోసి హత్య చేస్తున్న సైకో కిల్లర్‌ అని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు తాను ఆర్పీఎఫ్‌ అధికారినని చెప్పుకుంటూ గత కొన్ని రోజులుగా ట్రైన్‌లోని ప్రయాణికుల నుంచి డబ్బులు…

Read More

TGPSC గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ మారుతుందా? కమిషన్ కీలక ప్రకటన

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల సిలబస్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. సిలబస్‌లో మార్పులు చేసేందుకు ప్రస్తుతం ఎలాంటి కమిటీని నియమించలేదని సెప్టెంబరు 21న స్పష్టం చేసింది. సిలబస్‌లో ఏమైనా కీలక మార్పులు చేయాల్సి వస్తే అభ్యర్థులకు కనీసం ఏడాది ముందుగానే సమాచారం అందిస్తామని వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల సిలబస్‌లో టీజీపీఎస్సీ మార్పులు చేస్తోందా? అంటూ అభ్యర్థుల నుంచి కమిషన్‌కు…

Read More