షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేయండి.. పట్టులాంటి మెరిసే జుట్టు మీ సొంతం!
కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూల వల్ల జుట్టు నిర్జీవంగా, పొడిగా మారుతుంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ముల్తానీ మట్టి (Multani Mitti) తో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని బ్యూటీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ముల్తానీ మట్టి జుట్టును మృదువుగా (Smooth) చేయడమే కాకుండా, తలలోని అదనపు నూనెను, మురికిని సమర్థవంతంగా తొలగిస్తుందని అంటున్నారు. జుట్టు సంరక్షణ కోసం ముల్తానీ మట్టిని ఎలా ఉపయోగించాలి..? ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. ముల్తానీ మట్టి వల్ల కలిగే ప్రయోజనాలు: ముల్తానీ…
