కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
గుణ ప్రాంతానికి చెందిన సోను జాట్ అనే వ్యక్తి సంక్రాంతి పండగను జరుపుకోవడానికి తన భార్య, నాలుగేళ్ల కుమార్తె తాన్యతో కలిసి బుధవారం తమ స్వగ్రామానికి కారులో బయల్దేరాడు. బైపాస్‌లోని దోఖంభా ప్రాంతానికి చేరుకోగానే రెండు నీల్‌గాయ్ జంతువులు అకస్మాత్తుగా రోడ్డు పైకి వచ్చాయి. ఒక్కసారిగా దూసుకొచ్చిన అడవి జంతువులను చూసి సోను అలర్టయ్యే లోపే దారుణం జరిగిపోయింది. ఆ జంతువుల్లో ఒకటి కారు అద్దం పగలగొట్టుకుని లోపలికి దూసుకొచ్చింది. దీంతో ముందు సీటులో తల్లి ఒడిలో…
