ఏసీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం పక్కా..
నిరంతరం నడపొచ్చా: ఆధునిక సాంకేతికతతో వస్తున్న ఏసీలు ఎక్కువ కాలం వచ్చేలాగే తయారవుతాయి. మీ ఏసీ కండిషన్ బాగుండి.. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తే చాలా గంటలు వాడినా ప్రమాదం ఏమీ లేదు. కానీ ఏదైనా యంత్రానికి విశ్రాంతి అవసరమని గుర్తుంచుకోవాలి. ఎన్ని గంటలు వాడితే సేఫ్: సాధారణంగా ఏసీని నిరంతరాయంగా 8 నుండి 12 గంటల పాటు నడపడం ఉత్తమం. రాత్రంతా వాడినా పెద్దగా సమస్య ఉండదు. కానీ 24 గంటల పాటు ఆపకుండా నడిపితే…
