తాజావార్తలు

Andhra Pradesh: అటు వైసీపీ.. ఇటు టీడీపీ.. ఈసీకి పోటాపోటీ ఫిర్యాదులు.. పీక్స్‌కు ఏపీ లోకల్ సమరం


Andhra Pradesh: అటు వైసీపీ.. ఇటు టీడీపీ.. ఈసీకి పోటాపోటీ ఫిర్యాదులు.. పీక్స్‌కు ఏపీ లోకల్ సమరం

ఏపీ స్థానిక ఎన్నికల్లో పొలిటికల్‌ రచ్చ కొనసాగుతోంది. పురపోరుకు నామినేషన్ల ఘట్టం ముగిసినా.. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. క్షేత్రస్థాయి ఘటనలు ఒక రేంజ్‌ దుమారమైతే.. పైస్థాయిలో నేతల కంప్లయింట్స్‌ కథాకమామీషు మరోలా ఉంది. రణరంగాన్ని తలపించిన నామినేషన్‌ ఘట్టంపై గట్టిగానే పోరాడాలని ఫిక్సయ్యింది వైసీపీ. అందులో భాగంగానే… మరోసారి అధినేత జగన్‌ ఆధ్వర్యంలో SECని కలిసి ఫిర్యాదు చేసింది. నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘటనలను ఎలక్షన్ కమిషనర్ అనిల్‌ చంద్రకి వైసీపీ చీఫ్ జగన్మోహన్‌రెడ్డి వివరించారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థులను నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారనీ… గడువు పెంచైనా సరే అర్హులకు పోటీచేసే అవకాశం దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఇక నామినేషన్ల పొడగింపు విషయమై.. హైకోర్టులో పిటిషన్‌ వేసిన వైసీపీకి చుక్కెదురైంది. ఆ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్‌ చేసింది. అనంతరం గవర్నర్‌ నజీర్‌ను కూడా కలిసిన జగన్‌… జరిగిన పరిణామాలపైనా, SECపైనా కంప్లయింట్‌ ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వంతో లాలూచీ పడ్డారనీ… కూటమి నేతలు అరాచకం సృష్టిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో హైకోర్టుకూడా స్పందించకపోవడం దారుణమన్న జగన్‌… సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు.

వైసీపీ ఫిర్యాదుల సంగతి అలా ఉంటే.. ఆ లైన్‌లోకి అధికార కూటమి కూడా వచ్చేసింది. పోటాపోటీ అన్నట్టుగా… ఎన్నికల కమిషనర్ కలిసి హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు చేసింది టీడీపీ నేతల బృందం. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య.. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా జగన్‌ తీరు ఉందన్నారు. తన హయాంలో అరాచకం సృష్టించిన జగన్‌.. నిస్పక్షపాతంగా ఎన్నికలు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. మరి, నామినేషన్ల పూర్తయ్యేనాటికే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు లోకల్‌ ఎలక్షన్స్‌ రచ్చ.. పక్కాలోక్‌ అనిపిస్తుందా? అనే చర్చ మొదలైంది. నెక్ట్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *