ఆ లోపం గుండెకు కూడా కీడే.. స్త్రీలు, పురుషులలో హిమోగ్లోబిన్ ఎంత ఉండాలో తెలుసా..?
శరీరంలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల రక్తహీనత వస్తుంది. హిమోగ్లోబిన్ (Hb) అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ఐరన్ తో కూడిన ప్రోటీన్.. ఇది ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని కణజాలాలకు ఆక్సిజన్‌ను రవాణా చేసి, కార్బన్ డయాక్సైడ్‌ను తిరిగి ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.. దీని స్థాయిలు తగ్గితే రక్తహీనత వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్ సరైన స్థాయిలో నిర్వహించడం చాలా ముఖ్యం.. లోపం అనేక…
